ఆదర్శంగా నిలిచిన భద్రాద్రి కొత్త గూడెం ఎస్పీ
ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే జనాలు భయపడుతున్న క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ పి సునీల్ దత్ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వాసుపత్రుల పట్ల జనం చిన్న చూపు ఉన్న క్రమంలో దానిని పోగొట్టేందుకు తన సతీమణికి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాసుపత్రి లో కాన్పు చేయించారు. కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రి లో అత్యాధునిక సదుపాయాలు ఉన్నా అనేక మంది ప్రైవేటు ఆసుపత్రులకు తరలి వెళ్తున్నారు. ఏమీ లేని పేదల కోసమే ప్రభుత్వాసుపత్రులు అన్న భావన సాదారణ జనం లో నెలకొన్నది.
ఈ క్రమం జిల్లా పోలీస్ బాస్ సునీల్ దత్ తన శ్రీమతి రెండవ కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ సరళను సంప్రదించారు.
గత మూడు నెలలుగా ప్రభుత్వాసుపత్రి లోనే వైద్య సహాయం తీసుకున్నారు. డెలివరీ సైతం ప్రభుత్వాసుపత్రి లో చేయించుకుని ఆదర్శంగా జనానికి నిలిచారు. ఇక తల్లి, బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రి సేవలను జిల్లా ఎస్ పి సునీల్ దత్ అభినందించారు. కొవిడ్ నేపద్యం లోను ప్రభుత్వాసుపత్రిని నమ్ముకుని వైద్య సేవలు పొందిన ఎస్ పి సునీల్ దత్ దంపతులు ఆదర్శంగా నిలిచారు. సునీల్ దత్ ప్రభుత్వాసుపత్రి ని నమ్మి తన సతీమణి తో కాన్పు చేయించటం పట్ల జిల్లా కలెక్టర్ యంవి రెడ్డి ప్రశంసించారు. ఆసుపత్రి సిబ్బంది ఇదే స్పూర్తి కొనసాగించి, ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)