మరో ట్విస్ట్‌..! సీఎంకు స్పీకర్ డెడ్‌లైన్‌..!

మరో ట్విస్ట్‌..! సీఎంకు స్పీకర్ డెడ్‌లైన్‌..!

ఉత్కంఠభరితంగా కొనసాగుతోన్న కర్ణాటక రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది... ముఖ్యమంత్రి కుమారస్వామి, విపక్ష నేత యడ్యూరప్పతో సమావేశమైన స్పీకర్ రమేష్ కుమార్... బలపరీక్షపై ఓటింగ్‌కు సిద్ధంకావాలని కుమారస్వామిని కోరారు. అయితే, మరింత సమయంలో కావాలని ఆయన విజ్ఞప్తి చేయగా.. బీజేపీ మాత్రం వెంటనే ఓటింగ్‌కు వెళ్లాలని కోరింది. కాగా, తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతుండడంతో.. అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌ బల నిరూపణకు డెడ్‌లైన్ పెట్టారు స్పీకర్. ఇవాళ రాత్రి 9 గంటల వరకు బలాన్ని నిరూపించుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టులో తమ పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున తమకు రేపటి వరకు సమయం ఇవ్వాలని జేడీఎస్‌ ఎమ్మెల్యేలు.. స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినప్పట్టికీ ఆయన నిరాకరించారు. అయితే, ఇవాళ రాత్రి 9 గంటలలోగా ముఖ్యమంత్రి బలపరీక్షకు సిద్ధం కాకపోతే.. తానే రాజీనామా చేస్తానంటూ స్పీకర్ రమేష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. తనను బలిపశువును చేయొద్దని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.  స్పీకర్ ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. రాత్రి 9 గంటలకు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోననే చర్చ సాగుతోంది.