సాధ్వీ ప్రజ్ఞకు కోర్టులో ఊరట

సాధ్వీ ప్రజ్ఞకు కోర్టులో ఊరట

మాలేగావ్ బాంబు పేలుడులో నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హురాలిగా ప్రకటించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ పేలుడులో తన కొడుకును కోల్పోయానని నిసార్ అహ్మద్ అనే వ్యక్తి ఈ వ్యాజ్యాన్ని కోర్టులో దాఖలు చేశారు. ప్రస్తుతం సాధ్వీ ప్రజ్ఞా మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.