అనూహ్యంగా పెరిగిన శానిటైజర్ల వాడకం.. ఉపయోగాలు..! అనర్థాలు..!

అనూహ్యంగా పెరిగిన శానిటైజర్ల వాడకం.. ఉపయోగాలు..! అనర్థాలు..!

ఇప్పటివరకు సరైన మందు, వ్యాక్సిన్‌ లేని కరోనావైరస్‌ కట్టడికి.. భౌతికదూరం పాటించడం, మస్ట్‌గా మాస్క్‌ ధరించడం.. ఇక, వ్యక్తిగత శుభ్రత పాటించడం ముఖ్యం.. దీంతో.. అనూహ్యంగా శానిటైజర్ల వాడకం పెరిగిపోయింది.. కరోనా వైరస్‌ భయంతో జనాల్లో శుభ్రతపై అవగాహన పెరిగింది. మాటిమాటికీ చేతులను శానిటైజ్‌ చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. ముఖానికి మాస్క్‌, పాకెట్‌లో శానిటైజర్‌.. సాధారణం అయిపోయింది. ఈ కరోనా కాలంలో ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రతిఒక్కరూ.. ఎవరి స్థాయిలో వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే శానిటైజర్లు వాడకం పట్ల చాలామందిలో అవగాహన ఉండటం లేదు. 

శానిటైజర్‌ను ఎక్కువగా వాడడం వల్ల వచ్చే అనర్థాలేమిటి? శానిటైజర్ వాసన పీల్చితే ఏమవుతుంది? శానిటైజర్‌ రాసుకున్న చేతితో ఆహారం తీసుకుంటే వచ్చే ఇబ్బందులేంటీ? సువాసన వెదజల్లే సానిటైజర్ల నాణ్యత ఎంత? అనే విషయంలో అవగాహన తప్పనిసరి. ఇప్పుడు పల్లెనుంచి పట్నం దాకా.. పట్నం నుంచి ప్రపంచం దాకా... ఏ నోట విన్నా కరానా.. ఆ వెంటనే శానిటైజర్... ఇవే మాటలు. ధనిక, పేద అనే తేడా లేకుండా ఇప్పుడంతా.. హ్యాండ్ శానిటైజర్ వాడుతున్నారు. అయితే, మనం వాడే శానిటైజర్‌లో ఏముంటుంది.. బయట దొరికే శానిటైజర్లన్నింటికీ.. కరోనా వైరస్‌ను అరికట్టే సామర్థ్యం ఉంటుందా? అంటే మాత్రం సమాధానం ఉండదు. కరోనా మాట వింటనే హడలెత్తిపోతున్న ఈ రోజుల్లో.. భయానక పరిస్థితుల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. వైరస్ కట్టడికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో జనాల్లో అవగాహాన పెరిగింది. కరోనా రాకుండా ముందు జాగ్రత్తలెలా తీసుకోవాలనే విషయంలో.. పట్నం నుంచి పల్లెల దాకా.. అటు నుంచి మారుమూలన ఉండే ఏజెన్సీ ప్రాంతాల దాకా అవగాహాన వచ్చింది. మరి శానిటైజర్లతో ఉపయోగిం ఏంటి? వచ్చే అనర్థాలు ఏంటి..? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం కింది వీడియోను క్లిక్ చేయండి...