తృటిలో త‌ప్పించుకున్న మావోయిస్టు అగ్ర‌నేత‌లు..! కీల‌క ప‌త్రాలు ల‌భ్యం

తృటిలో త‌ప్పించుకున్న మావోయిస్టు అగ్ర‌నేత‌లు..! కీల‌క ప‌త్రాలు ల‌భ్యం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అడవుల్లోకూంబింగ్ టీమ్ నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు మావోయిస్టు కీల‌క నేత‌లు.. అయితే, మావోయిస్టుల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారం ల‌భించింది... వివ‌రాల్లోకి వెళ్తే.. తిర్యాని మండలం అడవుల్లో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వ‌హించాయి.. కూంబింగ్ టీమ్ నుంచి మావోయిస్టు స్టేట్ కమిటీ మెంబర్ మైలవరపు అడెల్లు అలియాస్ భాస్కర్, ఏరియా కమిటీ మెంబర్ వర్గేష్‌తో పాటు మరో ముగ్గురు మావోయిస్టు సభ్యులు త‌ప్పించుకున్నార‌ని చెబుతున్నారు.. ఇక‌, ఘ‌ట‌నా స్థ‌లంలో మావో్యిస్టుల‌కు సంబంధించిన కీల‌క ప‌త్రాలు ల‌భ్య‌మైన‌ట్టు చెబుతున్నారు పోలీసులు.. విప్లవ సాహిత్యం, మావోయిస్టుల యూనిఫాంలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, డిటోనేటర్లు,  పేలుళ్ల‌కు ఉప‌యోగించే వైర్లు, పాలితిన్ కార్పెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.. మ‌రోవైపు.. త‌ప్పించుకున్న మావోయిస్టుల కోసం మ‌రింత ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు పోలీసులు.