2.0 టీజర్ ను మామూలుగా చూడలేమట !

2.0 టీజర్ ను మామూలుగా చూడలేమట !

శంకర్, రజినీల '2 పాయింట్ 0' చిత్రం ఆఖరి దశ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే.  నవంబర్ 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది.  దీంతో టీజర్‌ను సిద్ధం చేశారు దర్శక నిర్మాతలు.  13వ తేదీ నుండి   థియేటర్లలో ఈ టీజర్ ప్రదర్శితం కానుంది.  

అయితే ఈ టీజర్‌ను మామూలుగా వీక్షించడం కుదరట.  ఎందుకంటే టీజర్‌ను త్రీడీ ఫార్మాట్లో రూపొందించి రిలీజ్ చేస్తున్నారు.  అందుకే త్రీడీ అద్దాలు పెట్టుకోవాల్సిందే.   13వ తేదీ నుండి పివిఆర్, సత్యం థియేటర్లలో ఇది ప్రదర్శించబడుతుంది.  టీజర్ ప్లే చేసే థియేటర్లలో సినిమాకు వెళ్లే వారికి ముందుగానే త్రీడీ గ్లాసెస్ ఉచితంగా ఇవ్వనున్నారు.  టీజర్ సమయంలో వాటిని ధరించి ప్రేక్షకులు ఆ త్రీడీ అనుభూతిని పొందవచ్చు.