స్పెషల్ సెట్‌లో లైగర్..

స్పెషల్ సెట్‌లో లైగర్..

రౌడీ హీరో విజయ్ తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. తన తొలి సినిమాతోనే అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వరుస సినిమాల్లో కొత్త పాత్రలతో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్‌కు స్టార్ హీరో ఫాలోయింగ్ వచ్చింది. అయితే ప్రస్తుతం విజయ్ టాలెంటెడ్ దర్శకుడు పూరి జగన్నాథ్‌తో చేస్తున్నాడు. ఈ సినిమాకి లైగర్ పేరును ఖరారు చేశారు. ఇందులో విజయ్ బాక్సర్‌గా కనిపించి ఆకట్టుకోనున్నాడు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే చేస్తోంది. ఈ సినిమాను పూరి, చార్మీ, కరణ్ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం బాక్సింగ్ స్టేజ్‌కు సంబంధించి ఓ కొత్త సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారట. దీనిని హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడా వద్ద రామానాయుడు స్టూడియోస్‌తో ఏర్పాటు చేస్తున్నారట. ఈ సినిమా చిత్రీకరణను మార్చి నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ సెట్‌లో కొన్న ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పునఃప్రారంభానికి కావలసిన ఏర్పాట్లను మొదలుపెట్టారట. ఇప్పటికే సగం వరకు ఈ సినిమా పూర్తి కావడంతో మిగతా సినిమాను కూడా కుదిరినంత త్వరగా పూర్తి చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి విజయ్ వారి అంచనాలను ఎంత వరకు అందుకుంటాడో వేచి చూడాలి.