అధికార ప్రతిపక్షాలను కంగారు పెట్టిన కాంగ్రెస్ నేత ట్వీట్ !

అధికార ప్రతిపక్షాలను కంగారు పెట్టిన కాంగ్రెస్ నేత ట్వీట్  !

ఏరి కోరి తెచ్చి పార్టీలో చేర్చుకున్నారు. ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాతే... మనసు గాయమైందంటూ అధికార పార్టీ ని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి ఆయనకి కొంత ఇబ్బంది పడ్డా... జనంలోనే ఉంటున్నారు. కానీ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు పరిపరి విధాలుగా చర్చకు తెర  లేపింది.  

 
చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి..తాత రంగారెడ్డి పేరుతోనే ఆ జిల్లా ఏర్పడింది. అలాంటి ఫ్యామిలీ నుండి.. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండలికాని కేసీఆర్... విశ్వేశ్వరరెడ్డి ని టీఆరెస్ లో చేర్చుకున్నారు. అప్పటికే తెలంగాణ ఉద్యమంలో ఉన్న విశ్వేశ్వరరెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంట్ కి పంపారు. అయితే... పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్... అప్పటి మంత్రి మహేందర్ రెడ్డి ల మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో అధికార పార్టీనే కాదని... కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముందస్తు ఎన్నికల సమయంలో టీఆరెస్ నుండి... ఎంపీగా ఉండి పార్టీ మారింది ఇతనే.

టీఆరెస్ కి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడని సమయంలో విశ్వేశ్వరరెడ్డి... తన వాయిస్ పెంచారు. ఎన్నికల్లో చేవెళ్ల నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పాలిటిక్స్ లో చురుకుగానే పాల్గొంటున్నారు. అయితే... ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీట్... విశ్వేశ్వరరెడ్డి ఎందుకు ఇలా చేశారనే చర్చ మొదలైంది.  

తెలంగాణలో కేసీఆర్.. కేటీఆర్ పాలనలో కరోనా కట్టడి భేష్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.  అప్పటి వరకు టీఆరెస్ పై ఒంటికాలితో లెస్ విశ్వేశ్వరరెడ్డి... ఇలా ప్రభుత్వం కరోన కట్టడిలో సక్సెస్ అని... మరణాలు కూడా తక్కువ చేయగలిగింది అని ...ప్రశంసలు కురిపించారు.  బద్ధశత్రువులుగా  ఉండే...టీఆరెస్.. విశ్వేశ్వరరెడ్డి ల మధ్య ఎక్కడైనా సయోధ్య కుదిరిందా..? మళ్ళీ టీఆరెస్ వైపు ఆకర్షితుడయ్యారా..? అనే టాక్ మొదలయ్యింది. కానీ.. విశ్వేశ్వరరెడ్డి మాత్రం..కొట్టి పారేశారు. నేను చేసిన ట్వీట్ అందరికి అర్థం అయినట్టు లేదు..అనుకున్నారట.

కేసీఆర్.. కేటీఆర్ లను తిడుతూ ట్వీట్ చేస్తే... టీఆరెస్ టీం అంతా తిట్ల దండకాలు ఎత్తుకుంటుంది..కరోనా విషయంలో అంతా బాగుంది అని వెటకారంగా ట్వీట్ చేస్తే..నన్ను రోజు తిట్టే టీం రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నారట. కరోనా కట్టడిలో భేష్ అంటూ చేసిన ట్వీట్లు వ్యవహారంలో తిట్లు తగ్గి.. రీట్వీట్ లు పెరిగాయని సెటైర్లు వేస్తున్నారు విశ్వేశ్వరరెడ్డి.  అయితే... ట్వీట్  లో పొగిడినట్టు కనిపించినా..అది సెటైర్లు వేస్తూ చేసిందే తప్పుతే అనుకూలంగా కాదని చెప్పుకొచ్చారు విశ్వేశ్వరరెడ్డి.  

విశ్వేశ్వరరెడ్డి చేసిన ట్వీట్..తాను సెటైరిక్ అనుకుంటున్నా... అది మాత్రం అనుకూలంగా మారిపోయారా ఏంటి అని చర్చ మాత్రం జరిగింది. పార్టీలో కొందరు నాయకులు కూడా ఇలాంటి చర్చ నే చేశారు. కానీ కొండ ఇలా ఎందుకు చేశారనే చర్చ మాత్రం తెర మీదకు వచ్చింది.