ఎన్నికల నిబంధనల అమలుకు ప్రత్యేక బృందాలు..

ఎన్నికల నిబంధనల అమలుకు ప్రత్యేక బృందాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిబంధనల అమలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా 6,600 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, 6,160 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో 161 బృందాలతో లావాదేవీలపై నిఘా పెడతామన్న ద్వివేది.. గత మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో రూ. 29.91 కోట్ల నగదు, 13.57 కిలోల బంగారం, 70 వాహనాలు సీజ్ చేసినట్టు తెలిపారు. ఇక ఎక్సైజ్ తనిఖీల్లో రూ.1.31 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు గోపాలకృష్ణ ద్వివేది.