ఆ సంస్థ ఉద్యోగుల్నీ మేము ఆదుకుంటాం

ఆ సంస్థ ఉద్యోగుల్నీ మేము ఆదుకుంటాం

ఉద్యోగాలు కోల్పోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలట్లు, ఉద్యోగులకు తమ సంస్థల్లో అవకాశం కల్పిస్తామని స్పైస్ జెట్ ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోయిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బందికి నియామకాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ స్పష్టం చేశారు. తామిప్పటికే 100 మందికి పైగా పైలట్లు, 200 మంది క్యాబిన్‌ సిబ్బంది, 200 మందికి పైగా సాంకేతిక, విమాన సిబ్బందిని తీసుకున్నామని, త్వరలో మరిన్ని విమానాలు కొనుగోలు చేస్తామని స్పైస్‌జెట్‌ వెల్లడించింది. తాము తమ విమాన సేవలను మరింత విస్తరిస్తామని, మరింత మంది జెట్‌ ఉద్యోగులకు అవకాశం ఇస్తామని చెప్పారు. ప్రయాణీకులకు అసౌకర్యాన్ని నివారించేందుకు అన్ని చర్యలూ చేపడతామని తెలిపారు. కేంద్రం అనుమతిస్తే దేశీయంగా 24 కొత్త సర్వీసులను నడుపుతామని స్పైస్‌జెట్‌ ప్రకటించింది.