ఎవెంజర్స్ తరువాత ఆ సినిమానే..!!

ఎవెంజర్స్ తరువాత ఆ సినిమానే..!!

ఈ ఏడాది హాలీవుడ్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ సినిమాల్లో ఎవెంజర్స్ ఒకరి.  ఈ సిరీస్ లో చివరి సినిమా కావడంతో అంచనాలు వచ్చాయి.  దానికి తగ్గట్టుగానే సినిమా వసూళ్లు సాధించింది.  సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు హాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా రేసులో అవతార్ తో పోటీ పడుతున్నది.  

ఈ సినిమా తరువాత ఆ స్థాయిలో వసూళ్లు సాధిస్తున్న మూవీ స్పైడర్ మ్యాన్ మూవీ.  ఈ సినిమా ఇండియాలో భారీ వసూళ్లు సాధిస్తున్నది.  ఇండియాలో సోని పిక్చర్స్ రిలీజ్ చేసిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా స్పైడర్ మ్యాన్.  స్పైడర్ మ్యాన్ సీరీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఇదే.  అలానే ఎవెంజర్స్ తరువాత ఇండియాలో భారీ వసూళ్లు సాధిస్తున్న సినిమాగా స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ రికార్డు సాధించింది.