కోహ్లి చాలెంజ్‌.. స్వీకరించిన రషీద్‌

కోహ్లి చాలెంజ్‌.. స్వీకరించిన రషీద్‌

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలెంజెస్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. సెలెబ్రిటీల నుండి సామాన్యుల వరకు ఈ చాలెంజెస్‌ స్వీకరించి ఇతరులకు విసురుతున్నారు. ఐస్‌ బకెట్‌, ఫిట్‌ ఇండియా, కికీ‌ చాలెంజెస్‌ ఎంతో మందిని ఆకర్షించాయి. తెలంగాణాలో 'గ్రీన్ చాలెంజ్' ట్రెండ్ హవా నడిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో కొత్త చాలెంజ్ ను తీసుకొచ్చాడు. 'క్విర్కీ క్యాచెస్' పేరుతో విరాట్ చాలెంజ్ ను తీసుకొచ్చాడు. కోహ్లీ ఈ చాలెంజ్ ను ఓ వీడియో ద్వారా చూపించి.. మీరు ఎవరైనా నా కంటే తక్కువ సమయంలో ఈ చాలెంజ్‌ను పూర్తి చేయగలరా? అని సవాల్ విసిరాడు. ఈ చాలెంజ్ లో క్యాచ్‌లు పట్టాలి. అయితే ఆ క్యాచ్‌లను వైరటీగా పట్టాలి.

'8 సెకన్లలో ఆరు క్యాచ్‌లను మిస్‌ అవ్వకుండా పట్టాను. మీరు ఎవరైనా నా కంటే తక్కువ సమయంలో క్యాచ్‌లను పట్టగలరా' అని కోహ్లి చాలెంజ్ విసిరాడు. కేఎల్‌ రాహుల్‌, జాంటీ రోడ్స్‌, రషీద్‌ఖాన్‌, డుప్లెసిస్‌, షకీబ్‌ ఆల్‌ హాసన్‌, గిబ్స్‌ల కు కోహ్లీ సవాల్ విసిరాడు. ఈ సవాల్‌ను ఆఫ్ఘానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ స్వీకరించాడు. మరి ఈ క్యాచ్‌లను రషీద్‌ ఎలా పడుతాడో చూడాలి. భారత సంప్రదాయలపై విస్తృత ప్రచారం కల్పించాలని విరాట్ కోహ్లి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 'వేష్‌భూషా' చాలెంజ్‌ను ఇదివరకే తీసుకొచ్చాడు.