'బాటిల్ క్యాప్ చాలెంజ్‌'లో ఈ కేంద్ర మంత్రి విన్నర్‌..!

'బాటిల్ క్యాప్ చాలెంజ్‌'లో ఈ కేంద్ర మంత్రి విన్నర్‌..!

సోషల్‌ మీడియా పుణ్యమాని 'ఫిట్‌నెస్ చాలెంజ్'.. 'గ్రీన్ చాలెంజ్' వంటివి తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు ఇదే తరహాలో 'బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌' హల్‌చల్‌ చేస్తోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఇప్పుడీ చాలెంజ్‌ను ఫాలో అవుతున్నారు. తాజాగా కేంద్ర క్రీడా మంత్రి కిరెణ్ రిజిజు ఈ చాలెంజ్‌లో విన్ అయ్యారు. అలవోకగా బాటిల్‌ క్యాప్‌ను కాలితో తన్ని..  వీడియోను మంత్రి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. 
ఇంతకీ.. చాలెంజ్‌లో ఏం చేస్తారంటే.. ముందుగా ఓ బాటిల్‌ను టేబుల్‌పై పెట్టాలి. బాటిల్ మూతను కాస్త వదులుగా ఉంచాలి. అనంతరం దానికి కొంచెం దూరంలో నిలబడి బాటిల్ కిందపడకుండా.. కేవలం దాని మూత మాత్రమే ఊడిపోయేలా కాలితో తన్నాలి. ఐతే.. ఇది అంత ఈజీ చాలెంజ్ కాదు. దీనికి టెక్నిక్ కావాలి. ఫిట్‌నెస్‌ కావాలి. అందుకే.. ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారనే పేరున్న రిజిజు ఈ చాలెంజ్‌ను ఈజీగా చేసేశారు.