బంపర్ ఆఫర్ కొట్టేసిన స్పైడర్ భామ..!!

బంపర్ ఆఫర్ కొట్టేసిన స్పైడర్ భామ..!!

స్పైడర్ సినిమా తరువాత పాపం రకుల్ ప్రీత్ సింగ్ కు ఆఫర్లు రాలేదు.  ఆ సినిమా భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.  దీంతో ఈ స్పైడర్ పాప చాలా కాలం ఖాళీగా ఉంది.  ఆమెలో శ్రీదేవి పేస్ కట్స్ కనపడటంతో ఎన్టీఆర్ బయోపిక్ లో ఆఫర్ దొరికింది.  బాలకృష్ణతో ఆకు చాటు పిందె తడిసె సాంగ్ లో ఆడిపాడింది.  అంతేకాకుండా, ఈ సినిమాలో 20 నిమిషాలసేపు శ్రీదేవి పాత్రలో కనిపిస్తుందట.  ఇందుకోసం రకుల్ పాప ఏకంగా కోటి వసూలు చేసింది.  

ఎన్టీఆర్ బయోపిక్ తరువాత ఈ పాపకు బాగానే కలిసి వచ్చింది.  నాగచైతన్య కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.  బాబి దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్నాడు.  ఇందులో రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.  రారండోయ్ వేడుక చూద్దాం తరువాత రెండోసారి ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.  దీనితోపాటు, రకుల్ వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలోను ఛాన్స్ కొట్టేసిందట.  మొత్తానికి స్పైడర్ పరాజయం నుంచి ఇన్నాళ్లకు బయటపడిందన్నమాట రకుల్.