టీచర్‌ దెబ్బల భయం : 8వ తరగతి విద్యార్ధి ఆత్మహత్య !

టీచర్‌ దెబ్బల భయం : 8వ తరగతి విద్యార్ధి ఆత్మహత్య !

హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌లోని విశ్వభారతి హై స్కూల్‌ లో విషాదం చోటుచేసుకుంది. టీచర్‌ కొడుతుందన్న భయంతో గత నెల 28న మహేష్‌ అనే 8వ తరగతి విద్యార్థి స్కూల్ భివనంపై నుంచి దూకాడు. తీవ్ర గాయాలైన మహేష్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహేష్‌ ఇవాళ మృతి చెందాడు. హోంవర్క్ విషయంలో తోటి విద్యార్థులను మందలిస్తుండగా చూసిన మహేష్‌ భయంతో భవనంపై నుంచి దూకాడు. మహేష్‌ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మహేశ్‌ను టీచర్‌ మందలించడంతోనే ప్రాణాలు తీసుకున్నాడా ? లేక..రెయిలింగ్‌ లేకపోవడం వల్ల..ప్రమాదవశాత్తూ స్కూల్‌ బిల్డింగ్‌పై నుండి కిందపడి చనిపోయాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే తమ బాలుడి మరణానికి స్కూల్‌ యాజమాన్యమే కారణమంటూ మహేశ్ పేరంట్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసారు. స్కూల్‌ బిల్డింగ్‌పై తగిన జాగ్రత్తలు ఉండి ఉంటే.. మహేశ్‌ బిల్డింగ్‌పై నుంచి దూకడానికి వీలు పడేది కాదని వాపోతున్నారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న తర్వాత బిల్డింగ్‌పై రెయిలింగ్ ఏర్పాటు చేసింది స్కూలు యాజమాన్యం. ముందే రెయిలింగ్ ఉండి ఉంటే మహేశ్‌ ప్రాణాలు దక్కేవని స్థానికులు చెప్తున్నారు.