సీరియల్ నటి శ్రావణి- ఆర్‌ఎక్స్‌100 నిర్మాత ఆడియో లీక్‌..!

సీరియల్ నటి శ్రావణి- ఆర్‌ఎక్స్‌100 నిర్మాత ఆడియో లీక్‌..!

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. శ్రావణి మృతికి దేవరాజ్ కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆర్‌ఎక్స్‌100 నిర్మాత అశోక్‌రెడ్డి- శ్రావణి మధ్య జరిగిన సంభాషణ లీకయ్యింది. దేవరాజు మీద శ్రావణి కేసు నమోదు చేసిన సమయంలో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు తెలిసింది. అంతేకాకుండా గతంలోకూడా శ్రావణి దేవరాజ్ పై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ల ఫిర్యాదు చేసింది. దేవరాజ్ టిక్ టాక్ లో అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుని వారి దగ్గర డబ్బులు గుంజుతాడని పేర్కొంది. అంతే కాకుండా అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేస్తాడని పేర్కొంది. శ్రావణిని కూడా దేవరాజ్ ప్రేమ పేరుతో మోసం చేసి ముఖం చాటేసాడని అందువ్లలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని శ్రావణి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.