'బాపట్ల ఎంపీగా పోటీకి సిద్ధంగా లేను..'

'బాపట్ల ఎంపీగా పోటీకి సిద్ధంగా లేను..'

తాడికొండ ఎమ్మెల్యే టికెట్‌ను టీడీపీ అధిష్టానం తనకు ఎందుకు ఇవ్వలేదో కారణాలు తెలియవని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ చెప్పారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 95 శాతం మంది తనతోనే ఉన్నారని చెప్పారు. కార్యకర్తలకు తాను సమాధానం చెప్పాల్సి ఉందని.. పరిస్థితిని సీఎంకు వివరిస్తానని అన్నారు. తనపై ఎటువంటి ఆరోపణలు, వివాదాలు లేవని గుర్తు చేశారు. తాడికొండ టికెట్‌ పొందిన మాల్యాద్రికి అక్కడి నుంచి పోటీ చేయడం ఇష్టం లేదన్న శ్రవణ్‌కుమార్‌.. బాపట్ల ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా లేనన్నారు.