శ్రీ ప్లేబాయ్‌గా 'ప్రణవం'

శ్రీ ప్లేబాయ్‌గా 'ప్రణవం'

'ఈ రోజుల్లో' ఫేమ్ శ్రీ మంగం గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉన్నాడు. తాజాగా 'ప్రణవం' అనే సినిమాతో తిరిగి జనం ముందుకు రాబోతున్నాడు. నిజానికి జనవరి 29న విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాను ఫిబ్రవరి 5కు వాయిదా వేశారు. శ్రీ,, శశాంక్, అవంతిక, గాయత్రి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. ఈ మూవీని కుమార్ జి దర్శకత్వంలో ఎస్. తను నిర్మించారు. ఇందులో శ్రీ ప్లేబాయ్ గా నటించాడని, హీరోయిన్ల పాత్రలూ భిన్నంగా ఉంటాయని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అతి ప్రేమ అనర్థాలకు దారితీస్తుందనే కథాంశంతో 'ప్రణవం' రూపుదిద్దుకుందని శ్రీ తెలిపాడు. ఈ చిత్రానికి పద్మనాభ్ భరద్వాజ సంగీతం సమకూర్చారు. ఇందులోని ఓ పాటను ఆర్.పి. పట్నాయక్, ఉష కలిసి పాడటం విశేషం.