డిఫెరెంట్ జోనర్ లో శ్రీ విష్ణు

డిఫెరెంట్ జోనర్ లో శ్రీ విష్ణు

తెలుగు యువ హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. కెరియర్ ఆరంభం నుండి ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేసుకుంటూ మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా నీది నాది ఒకే కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇక త్వరలో ఈ యువ హీరో ఓ కొత్త సినిమాని మొదలెట్టనున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమాను చేయనున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన మెంటల్ మదిలో చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు చేయబోయే ఈ సినిమా క్రైమ్ నేపథ్యంలో ఇంటెన్స్ గా ఉండనుంది. మరోవైపు కామెడీ కూడా ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. శ్రీ విష్ణుకి ఈ సినిమా బాగా ప్లస్ అవుతుందని సమాచారం. దర్శకుడు వివేక్..ఈ సినిమా స్క్రిప్ట్ ను పవర్ ఫుల్ రెడీ చేసే పనిలో పడ్డాడట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ మూడో వారం నుండి జరగనుంది. అలాగే జ్యోతి లక్ష్మి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించిన సత్యదేవ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.