ఐపీఎల్ లో ఆ జట్ల తరపున ఆడాలని ఉంది : శ్రీశాంత్ 

 ఐపీఎల్ లో ఆ జట్ల తరపున ఆడాలని ఉంది : శ్రీశాంత్ 

భారత క్రికెటర్ ఎస్.శ్రీశాంత్ మళ్ళీ జాతీయ జట్టులోకి తిరిగి రావాలని కలలు కంటున్నాడు. ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా 7 ఏళ్ళు నిషేధానికి గురైన శ్రీశాంత్ తన రీఎంట్రీ పై ఆసక్తిగా ఉన్నాడు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ లో శ్రీశాంత్ నిషేధం ముగియనుంది. అందువల్ల తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోగలిగితే ఈ ఇండియా పేసర్‌ను రంజీ జట్టు ఎంపిక కోసం పరిశీలిస్తామని కేరళ కోచ్ తెలిపారు. అయితే తన రీఎంట్రీ పై స్పందించిన శ్రీశాంత్ మాట్లాడుతూ..."నేను 2023 ప్రపంచ కప్‌లో ఆడగలనని ఇప్పటికీ నమ్ముతున్నాను. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో తప్పకుండ నా పేరును ఉంచుతాను అని కూడా అన్నాడు. నన్ను కొనుగోలు చేయడానికి కొన్ని జట్లు ఆసక్తిగా ఉన్నాయి మళ్ళీ నేను ఐపీఎల్ ఆడుతాను అని తెలిపారు. అయితే మీరు ఏ జట్టు తరపున ఆడాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించినప్పుడు దానికి సమాధానం ఇస్తూ... నాకు ముంబై ఇండియన్స్ తరపున ఆడాలని ఉంది అని చెప్పిన శ్రీశాంత్ దాని తో పాటుగా రాయల్ ఛాలెంజర్స్, చైన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాలని ఉందన్నారు. ఒకవేళ నేను కోరుకున్న జట్ల తరపున అవకాశం రాకపోయినా వేరే   జట్టు జట్టుకైనా సరే ఆడుతాను అని అన్నాడు.