సన్‌రైజర్స్ జట్టులో దానిని ప్రోత్సహించను : విలియమ్సన్

సన్‌రైజర్స్ జట్టులో దానిని ప్రోత్సహించను : విలియమ్సన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడు మాజీ కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్, నేను మన్కడింగ్ ను ప్రోత్సహించను అని చెప్పారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సెప్టెంబర్ 19 న ప్రారంభం కానుండటంతో, మన్కడింగ్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. గత నెలలో అశ్విన్ ‌ను ఐపీఎల్ 2020 లో తాను మన్కడింగ్ చేయనివ్వనని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చెప్పినప్పటినుండి మన్కడింగ్ వివాదం మొదలయ్యింది. గత ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ అయిన రవిచంద్రన్ అశ్విన్ అప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ను మన్కడింగ్ చేసాడు. ఈ వివాదం పై మాట్లాడిన విలియమ్సన్... నేను ఖచ్చితంగా దీన్ని ప్రోత్సహించను. ఎవరైనా మోసం చేయాలని చూస్తున్నట్లయితే, అతనితో సైలెంట్ గా మాట్లాడటం విలువైనదని చెప్పాడు. అయితే ఆట యొక్క నియమాలను పాటించడం మాత్రమే కాకుండా మన ఆత్మను సంతృప్తి పరిచేలా ఆట ఆడాలి అని చెప్పాడు. అలాగే ఈ ఐపీఎల్ 2020 గురించి మాట్లాడుతూ... భారత్ లో ఈ టోర్నీ జరిగిఉంటే ఎక్కువగా ప్రయాణాలు ఉండేవి. కానీ ఇక్కడ అలా కాదు. కాబట్టి ఖాళీ రోజులో విశ్రాంతి తీసుకొని తర్వాతి మ్యాచ్ కూడా సన్నద్ధం కావచ్చు అని అన్నాడు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ దుబాయ్, అబుదాబి, షార్జా మూడు వేదికలో మాత్రమే జరుగుతుంది.