వార్నర్, సాహా విజృంభణ... హైదరాబాద్ భారీ స్కోర్ ... 

వార్నర్, సాహా విజృంభణ... హైదరాబాద్ భారీ స్కోర్ ... 

నిలవాలంటే తప్పనిసరిగా గెలవాలి.  గెలవాలంటే భారీ స్కోర్ సాధించాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బరిలోకి దిగింది.  ఢిల్లీతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగింది.  కెప్టెన్ వార్నర్, వృద్ధిమాన్ సహాలు మొదటి బంతి నుంచి దూకుడుగా ఆడటం మొదలుపెట్టారు.  వీలు చిక్కినప్పుడల్లా బంతులను ఫోర్లు, సిక్సర్లుగా మలుస్తూ భారీ స్కోర్ సాధించేందుకు బాటలు వేశారు.  వార్నర్ 66 పరుగులు, వృద్ధిమాన్ సాహా 87 పరుగులు, మనీష్ పాండే 44 పరుగులతో రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందు 220 పరుగుల లక్ష్యం ఉన్నది.  దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఈ భారీ స్కోర్ ను ఛేదిస్తుందా చూడాలి.