శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం..

శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం..

శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం విధించింది. ముఖానికి ఎవరూ ఎటువంటి ముసుగూ ధరించరాదని స్పష్టం చేసింది. ఈస్టర్ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన స్పష్టం చేశారు. సైనిక బలగాలకు తనిఖీకి అనుగుణంగా ఉండి నింధితులను  గుర్తించేందుకే బుర్ఖాపై నిషేధం నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.