రేపు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కనున్న శ్రీలంక క్రికెటర్... 

రేపు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కనున్న శ్రీలంక క్రికెటర్... 

శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ ఈ నెల 5న చేసిన యాక్సిడెంట్ లో ఓ 64 ఏళ్ల వ్యక్తి మరణించడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ఒకరోజు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఆ తర్వాత రోజు అతనికి కోర్టు బెయిల్‌ ఇచ్చింది. అయితే ఈ ఆటగాడు రేపు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కనున్నాడు అని తెలుస్తుంది. కొలంబోలోని రోడ్డుపై ఈ యాక్సిడెంట్ చేసిన సమయంలో కుశాల్ స్వయంగా నడిపారు కానీ అతనితో పాటుగా తన శ్రీలంక జట్టు సహచరుడు అవిష్కా ఫెర్నాండో కూడా కారులో ఉన్నారు. అయితే ఓ శ్రీలంక క్రికెట్ బోర్డు ఉద్యోగి వివాహానికి వెళ్లి వస్తున్న సమయం లో మెండిస్ ఈ యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక కరోనా లాక్ డౌన్ తర్వాత శిక్షణను తిరిగి ప్రారంభించిన శ్రీలంక జాతీయ జట్టులో మెండిస్ భాగం. ఇక శ్రీలంక తరఫున 44 టెస్టులు, 76 వన్డేలు, 26 టీ 20 లు ఆడిన మెండిస్‌ టెస్టుల్లో 2995 పరుగులు, వన్డేల్లో 2167 పరుగులు, 484 పరుగులు టీ 20లో సాధించాడు.