బెయిల్ మీద బయటికి వచ్చిన శ్రీలంక క్రికెటర్...

బెయిల్ మీద బయటికి వచ్చిన శ్రీలంక క్రికెటర్...

యాక్సిడెంట్ కేసులో ఆదివారం అరెస్టు అయిన శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్‌ను ఈ రోజు బెయిల్‌పై విడుదల అయ్యాడు. నిన్న తెల్లవారుజామున సైకిల్ ‌పై ప్రయాణిస్తున్న 64 ఏళ్ల వ్యక్తిని మెండిస్ కారు ఢీకొట్టింది  తర్వాత అతడిని ఆసుపత్రిలో చేర్చారు కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు . దాంతో పోలీసులు కుశాల్ ను అరెస్టు చేశారు. ఇక ప్రాథమిక పోలీసు దర్యాప్తులో మెండిస్ మద్యం సేవించి కారు నడపలేదని తెలిసింది. ఈ రోజు అతడిని కొలంబో శివారు పాండురాలోని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన తరువాత మెండిస్‌ను బెయిల్ ‌పై విడుదల చేశారు. ప్రమాదం జరిగినప్పుడు మెండిస్ శ్రీలంక జట్టు సహచరుడు అవిష్కా ఫెర్నాండో కూడా కారులో ఉన్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత శిక్షణను తిరిగి ప్రారంభించిన శ్రీలంక జాతీయ జట్టులో మెండిస్ భాగం. ఇక శ్రీలంక తరఫున 44 టెస్టులు, 76 వన్డేలు, 26 టీ 20 లు ఆడిన మెండిస్‌ టెస్టుల్లో 2995 పరుగులు, వన్డేల్లో 2167 పరుగులు, అలాగే పొట్టి ఫార్మాట్‌లో 484 పరుగులు చేశాడు.