శ్రీలంక ఎఫెక్ట్‌: కృష్ణపట్నం పోర్టులో హైఅలర్ట్‌

శ్రీలంక ఎఫెక్ట్‌: కృష్ణపట్నం పోర్టులో హైఅలర్ట్‌

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో హై అలెర్ట్ ప్రకటించారు అధికారులు... శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించడంతో నెల్లూరు జిల్లాలోని 125 తీరప్రాంత గ్రామాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. కృష్ణపట్నంపోర్టు, షార్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. తీరప్రాంతాలలో ఉగ్రవాదుల కదిలికలపై ఇంటెలిజెన్స్ నిఘా పెంచింది. మత్స్యకార గ్రామాల్లో సమావేశాలు నిర్వహించిన పోలీసులు.. అనుమానితులు, కొత్తవారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. సముద్రంలో కోస్ట్ గార్డ్, మెరైన్ గస్తీ ముమ్మరం చేశారు. తమిళనాడు నుంచి వచ్చే బోట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.