హత్య కేసులో అంతర్జాతీయ క్రికెటర్ అరెస్ట్...

హత్య కేసులో అంతర్జాతీయ క్రికెటర్ అరెస్ట్...

శ్రీలంక బాట్స్మెన్ కుశాల్ మెండిస్ ‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొలంబో శివారులో ఈ రోజు తెల్లవారుజామున సైకిల్ ‌పై ప్రయాణిస్తున్న 64 ఏళ్ల వ్యక్తిని మెండిస్ కారు ఢీకొట్టింది. ఆ తర్వాత అతడిని ఆసుపత్రిలో చేర్చారు కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. మెండిస్‌ను రేపు  మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు పోలీసుల తెలిపారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరైనా మద్యం మత్తులో ఉన్నారా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదు.  25 ఏళ్ల ఈ వికెట్ కీపర్-బ్యాట్స్మాన్ శ్రీలంక తరఫున 44 టెస్టులు, 76 వన్డేలు ఆడాడు. కరోనా లాక్ డౌన్ తర్వాత శిక్షణను తిరిగి ప్రారంభించిన శ్రీలంక జాతీయ జట్టులో మెండిస్ భాగం.