ప్రపంచ కప్ ఫిక్సింగ్ లో ఐసీసీకి షాక్... ఆధారాలున్నాయి

ప్రపంచ కప్ ఫిక్సింగ్ లో ఐసీసీకి షాక్... ఆధారాలున్నాయి

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా హైలెట్...కానీ ఆ దేశంలో కాదు అదే శ్రీలంక. 2011 ప్రపంచ కప్‌ను శ్రీలంక భారతదేశానికి "అమ్ముకుంది" అని మాజీ క్రీడా మంత్రి మహిందనంద అలుత్గమగే  ఆరోపించారు, అప్పటినుండి అక్కడ ఇదే హైలెట్. దీనిపై శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ క్రిమినల్ దర్యాప్తునకు ఆదేశించింది. అందులో భాగంగా 2011 శ్రీలంక చీఫ్ క్రికెట్ సెలెక్టర్ అరవింద డి సిల్వా అలాగే అప్పటి ఓపెనర్ ఉపుల్ తరంగ మరియు శ్రీలంక బ్యాటింగ్ లెజెండ్స్ మహేలా జయవర్ధనే, కుమార్ సంగక్కర లను కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ‌విచారణ కు పిలిచి వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. కానీ అందులో వారికి ఏ విధమైన ఆధారాలు దొరకలేదు. అయితే ఈ ప్రపంచ కప్ ఫైనల్ ను అనుమానించడానికి మాకు ఎటువంటి ఆధారాలు లేవు అని ఐసీసీ యొక్క అవినీతి నిరోధక విభాగం జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ స్పష్టం చేసారు. ఇక శ్రీలంక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా తమ విచారణ ఆపేసింది. దాంతో... ఇప్పుడు నా దగ్గర  ఆధారాలున్నాయి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అంటున్నాడు  మహిందనంద. నిజాం చెప్పాలంటే... ఇన్వెస్టిగేషన్ టీమ్ మొదట మహిందనందనే విచారించింది. అయితే అప్పుడు నావద్ద ఆధారాలు లేవు అనుమానం మాత్రమే అని వారికి చెప్పాడు. కానీ ఇప్పుడు  ఆధారాలు లేవు అని చెప్పిన ఐసీసీ కి కూడా షాక్ ఇస్తూ  నా దగ్గర  ఆధారాలున్నాయి అంటున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.