డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శ్రీలంక క్రికెటర్...

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శ్రీలంక క్రికెటర్...

శ్రీలంక పేసర్ షెహన్ మదుశంకా మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయ్యాడు. పన్నాల పట్టణంలో పట్టుబడినప్పుడు మదుశంకా వద్ద రెండు గ్రాముల హెరాయిన్ ఉందని పోలీసు అధికారి తెలిపారు. 2018 లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే అరంగేట్రంలో హ్యాట్రిక్ సాధించిన షెహన్ మదుశంకా, శ్రీలంక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్ డౌన్ లో ఉండగా తన కారును నడుపుతున్నప్పుడు పోలీసులు ఆపారు. కారులో అతనితో పాటుగా మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే ఈ 25 ఏళ్ల క్రికెటర్‌ను కోర్టులో హాజరుపర్చినప్పుడు రెండు వారాల కస్టడీకి మేజిస్ట్రేట్ ఆదేశించారు.షెహన్ మదుశంకా ఇప్పటివరకు 1 వన్డే మరియు 2 టీ 20 లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ రోజు వరకు అతని పేరుకు 5 అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి. ఈ కుడిచేతి పేసర్ చివరిసారిగా ఫిబ్రవరి 2018 లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. అయితే తన ఏకైక వన్డేలో హ్యాట్రిక్ నమోదుచేసాడు. బంగ్లా ఆటగాళ్లు మష్రాఫ్ మోర్తాజా, రుబెల్ హుస్సేన్ మరియు మహముదుల్లాలను అతను ఔట్ చేసాడు.