శ్రీలంక టార్గెట్ః 335

శ్రీలంక టార్గెట్ః 335

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ నమోదు చేసింది. ఆరొన్ ఫించ్ (153; 132 బంతుల్లో, 15 ఫోర్లు, 5 సిక్సులు) సెంచరీ నమోదు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (73; 59 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్‌వెల్ (46; 25 బంతుల్లో, 5 ఫోర్లు,1 సిక్స్) శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్, మరో బ్యాట్స్‌మన్ ఉస్మాన్ క్వాజా త్వరగా ఔట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన స్టీవ్ స్మిత్ కెప్టెన్ ఫించ్ కు చక్కటి సహకారం అందించాడు. శ్రీలంక బౌలింగ్ లో ఇసురు ఉదానా, ధనుంజయ డిసిల్వ చెరో రెండు వికెట్లు, లసిత్ మలింగా ఒక వికెట్ తీశాడు.