శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ లో గందరగోళం

శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ లో గందరగోళం

ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక-దక్షిణాఫ్రిక మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కాసేపు గందరగోళం ఎదురైంది. మైదానంలోని ఆటగాళ్లు, అంపైర్‌ భయంతో వణికిపోయారు. దీంతో ఏం జరిగిందో తెలియక స్టేడియంలోని ప్రేక్షకులు కూడా కాసేపు అయోమయానికి గురయ్యారు. 48 ఓవర్‌లో క్రిస్‌ మోరిస్‌ బౌలింగ్‌ చేస్తుండగా.. ఐదో బంతి వేశాక ఒక్కసారిగా మైదానంలోకి తేనెటీగలు గుంపులుగా వచ్చాయి. దీంతో ఆటగాళ్లతో సహా.. అంపైర్లు కూడా వాటి నుంచి తప్పించుకోవడానికి కింద పడుకున్నారు. కాసేపటికే అంతా సర్దుకోవడంతో వెంటనే మ్యాచ్‌ కొనసాగింది. అయితే దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఇలా తేనెటీగలు మ్యాచ్‌కు అంతరాయం కలిగిచడం ఇది రెండోసారి. 2017లో ఇరు జట్లు మధ్య వన్డే మ్యాచ్‌ సందర్భంగా తేనెటీగలు మైదానంలో వచ్చి ఆటకు చాలాసేపు అంతరాయం కలిగించాయి.