పాక్‌ క్రికెట్‌ బోర్డుకు ఝలక్‌ ఇచ్చిన శ్రీలంక

పాక్‌ క్రికెట్‌ బోర్డుకు ఝలక్‌ ఇచ్చిన శ్రీలంక


 పాక్‌ క్రికెట్‌ బోర్డుకు ఝలక్‌ ఇచ్చింది శ్రీలంక క్రికెట్‌ బోర్డు. ఆ దేశంలో జరగాల్సిన  టూర్‌ను క్యాన్సిల్‌ చేసుకుంది శ్రీలంక క్రికెట్‌ బోర్డు. ఈ నెలలో లంక టీమ్‌ పాక్‌లో వన్డే, టీ-20 సిరీస్‌ కోసం  పర్యటించాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి కరాచీ వేదిగా మూడు వన్డేలు, ఆ తర్వాత అక్టోబరు 5 నుంచి లాహోర్‌లో మూడు టీ20 మ్యాచ్‌ల్ని శ్రీలంకతో ఆడేలా పాకిస్థాన్ షెడ్యూల్ రూపొందించింది. కానీ ఈ టూర్‌కు దాదాపు 10 మంది క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాక్‌లో పర్యటించడానికి వారు విముఖత చూపించారు.

భద్రతా కారణాల రీత్యా వారు ఈ సిరీస్‌ ఆడటానికి ఒప్పుకోలేదు. స్వయంగా శ్రీలంక క్రీడల మంత్రి సీనియర్ క్రికెటర్లని పిలిపించి మాట్లాడినా వారు ఒప్పుకోలేదని సమాచారం. 2009 లో శ్రీలంక టీమ్‌ పాక్‌లో పర్యటించినప్పుడు వారిపై దాడులు జరిగాయి. బస్సులోని శ్రీలంక క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఏ క్రికెట్ జట్టు కూడా పాకిస్థాన్‌లో పర్యటించే సాహసం చేయలేదు. పాకిస్థాన్ కూడా అంతర్జాతీయ జట్లతో ఈ 10 ఏళ్లకాలంలో మ్యాచ్‌లను యూఏఈలోనే ఆడుతోంది.