అప్పుడు రకుల్ పత్తిత్తులా మాట్లాడింది...శ్రీరెడ్డి ఫైర్..!

అప్పుడు రకుల్ పత్తిత్తులా మాట్లాడింది...శ్రీరెడ్డి ఫైర్..!

రకుల్ ప్రీత్ పై నటి శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ కు ఆట మొదలైందంటూ ఫేస్ బుక్ లో ఓ వీడియో ను పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి మాట్లాడుతూ.... గతంలో తాను టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు రకుల్ టాలీవుడ్ లో అలాంటివేమీ లేవని వ్యాఖ్యానించిందని తెలిపింది. టాలివుడ్ లో డ్రగ్స్ వాడే కల్చర్ కూడా లేదని రకుల్ మాట్లాడినట్టు గుర్తు చేసింది. అంతే కాకుండా అప్పట్లో రకుల్ కాండిల్ ర్యాలీ లతో పత్తిత్తులా మాట్లాడిందని గుర్తు చేసింది. మరోవైపు టాలీవుడ్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తారా అంటూ మంచు లక్ష్మి సైతం వ్యాఖ్యానించిందని తెలిపింది. తనపై కామెంట్లు చేసిన వారికి ఇప్పుడు తెలుస్తుందని కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తనను విమర్శించినవారు కొందరు కరోనా బారిన పడ్డారు కూడా అని చెప్పుకొచ్చింది. త్వరలోనే ఒక్కొక్కరి రంకు బాగోతాలు భయట పడతాయని తెలిపింది. ఇదిలా ఉండగా దివంగత నటుడు సుశాంత్ ప్రేయసి రియా డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో చిత్రపరిశ్రమలో డ్రగ్స్ కలకలం రేగింది. రియా విచారణలో రకుల్ ప్రీత్ పేరును భయట పెట్టడంతో శ్రీరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసింది.