'మా ఫస్ట్ నైట్ అక్కడే జరిగింది'.. మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి !

'మా ఫస్ట్ నైట్ అక్కడే జరిగింది'.. మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి !

సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శ్రీ రెడ్డి గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంది. మకాం మార్చి చెన్నై చెక్కేసిన ఛాన్స్ దొరికినప్పుడల్లా నోటికి పని చెప్తుంది. సోషల్ మీడియాను వేదికచేసుకొని సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఇటీవల కరాటే కళ్యాణి , డ్యాన్స్ మాస్టర్ రాకేష్ పైన బూతుల దండకం చదివిన శ్రీ రెడ్డి. తాజాగా మరో వివాదాన్ని రేపింది.

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా లోని రామానాయుడు స్టూడియోను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి అమ్మేశారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ స్టూడియో ఉండబోదని పలువురు ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ స్టూడియోను అమ్మేసి వైజాగ్ లో ఉన్న స్టూడియోను అభివృద్ధి చేయాలని సురేష్ బాబు చూస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ విషయం పై శ్రీ రెడ్డి స్పందించింది. "ఎక్కడైతే నాకు అభిరామ్ కు ఫస్ట్ నైట్ అయ్యిందో ఆ రామానాయుడు స్టూడియో త్వరలో కనుమరుగు అవ్వనుంది" అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.