కన్నుల పండువగా రాములోరి కల్యాణం

కన్నుల పండువగా రాములోరి కల్యాణం

శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో రాములోరి కల్యాణం కన్నుల పండుగగా జరిగింది... చైత్రశుద్ధ నవమి అభిజిత్ లఘ్నమందు సీతారాముల కల్యాణ వేడుకను నిర్వహించారు. తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాన్ని నిర్వహించారు. మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కల్యాణ మండపాన్ని అలంకరించి వైభవంగా రాములోని కల్యాణం నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక నేత్రపర్వంగా సాగిన సీతారాముల కల్యాణ వేడుకను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.  దీంతో భద్రాద్రి ఆలయం, పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.