త్వరలో జమ్మూలో వెంకన్న ఆలయం!

త్వరలో జమ్మూలో వెంకన్న ఆలయం!

త్వరలో జమ్మూలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నామని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. నేడు తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖలో 17 కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయాన్ని సుందరంగా నిర్మించనున్నామని తెలిపారు. అదేవిధంగా ముంబై లో శ్రీనివాసుడి ఆలయం నిర్మించనున్నామని,ఆలయం నిర్మాణ దశలో ఉందని మార్చి నాటికీ నిర్మాణం పూర్తవుతున్నదని , మంచి ముహూర్తం చూసి ఆలయాన్ని ప్రారంభిస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 

జమ్మూలో వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుందని , త్వరలో స్థలాన్ని ఎంపిక చేసి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామని  సింఘాల్ తెలిపారు. కాగా గత ఏడాది (2019) లో తిరుమల శ్రీవారిని 2 కోట్ల 58 లక్షల 90 వేల179 మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. అదేవిధంగా  12 కోట్ల 49 లక్షల 80 వేల 815 లడ్డూలు పంపిణీ చేశామని... 1151,74 కోట్ల రూపాయల హుండీ ద్వారా ఆదాయం వచ్చిందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.