హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని జస్టిస్ శ్రీదేవి కొలీజియంకు లేఖ రాశారు. ఆమె అభ్యర్ధనను కొలీజియం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం జస్టిస్ గండికోట శ్రీదేవి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.