అది శ్రీదేవి విగ్రహమే కానీ..!!

అది శ్రీదేవి విగ్రహమే కానీ..!!

శ్రీదేవి గతేడాది హఠాత్తుగా దుబాయ్ లోని ఓ హోటల్ లో బాత్ టబ్ లో అనుమాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.  ఆమె మరణం తరువాత సినిమా ఇండస్ట్రీ చాలా కోల్పోయింది.  శ్రీదేవి వంటి నటి ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి దొరకరు అన్నది వాస్తవం.  కాగా, ఇప్పుడు ఈ అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సింగపూర్ లోని మేడం టుస్సాడ్ మ్యూజియంలో పెట్టబోతున్నారు.  సెప్టెంబర్ 4 వ తేదీన ఆమె విగ్రహాన్ని పెడుతున్నారు.  బంగారు వర్ణంలో ఉండే దుస్తులతో ధగధగ మెరిసిపోతున్నది విగ్రహాం.  విగ్రహానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు.  

దీనికి సంబంధించిన చిన్న వీడియోను బోనికపూర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎవరైనా సరే ఆ విగ్రహాన్ని చూస్తే.. అది నిజమైన విగ్రహం అని భ్రమపడటం గ్యారెంటీ.  ఎందుకంటే విగ్రహం అంత అద్భుతంగా జీవకళ ఉట్టిపడేలా ఉన్నది.