టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్యే...

టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్యే...

తనకు టీఆర్ఎస్ పార్టీ... హుజూర్‌నగర్‌ టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు మలి దశ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ... లేకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు. తనకు టికెట్ రాకుండా జగదీశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించిన శంకరమ్మ... ఆయనకు దమ్ముంటే హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. పార్టీ అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌... హుజూర్‌నగర్‌ టికెట్ నాకు కేటాయించడానికి సానుకూలంగా ఉన్నా... ఆయన అనుచరుడికి టికెట్‌ ఇప్పించుకునేందుకు జగదీశ్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించిన శంకరమ్మ... ఇతర పార్టీల నేతలతో తాను ఫోన్‌లో మాట్లాడుతున్నానంటూ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.