వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన శ్రీలంక

వరల్డ్‌కప్‌: టాస్‌ గెలిచిన శ్రీలంక

వరల్డ్‌కప్‌లో మరో ఆసక్తికర పోరుకు సర్వం సిద్ధమైంది. సెమీఫైనల్స్‌కు ముందు టీమిండియా తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా శ్రీలంకతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. టోర్నీలో తొలిసారిగా రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం లభించింది. పేస్‌ బౌలర్‌ షమీ ప్లేస్‌లో జడేజాకు అవకాశం వచ్చింది. 

భారత జట్టు:  రాహుల్‌, రోహిత్‌శర్మ, కోహ్లీ(కెప్టెన్‌), పంత్‌, ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌, కుల్‌దీప్‌, జస్ప్రిత్‌బుమ్రా, 
శ్రీలంక జట్టు: కరుణరత్నే(కెప్టెన్‌), కుశాల్‌పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌, పెరీరా, తిరుమన్నె,  మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వ, ఉదాన, కసున్‌ రజిత, మలింగ