'రోజుకు 20 గంటలు నిజాయితీగా పని చేస్తా..'

'రోజుకు 20 గంటలు నిజాయితీగా పని చేస్తా..'

ఎక్సైజ్‌ ఆదాయాన్ని పెంచాడానికి కృషి చేస్తానని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. తెలంగాణ ఎక్సైజ్‌, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా ఇవాళ ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నమ్మకంతో తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. రోజుకు 20 గంటలు నిజాయితీగా కష్టపడి పనిచేసి తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. రాష్ట్రానికి  ఆదాయాన్ని ఇచ్చే ఎక్సైజ్‌ శాఖను అప్పగించడం సంతోషకరమన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత అక్రమ రవాణా, కల్తీ మద్యం లాంటివి పోయాయన్న శ్రీనివాస్‌గౌడ్‌.. గీత కార్మికులను నిర్లక్ష్యం చేసిన చరిత్ర ఆంధ్ర ప్రభుత్వానిదని అన్నారు. గీత కార్మికులకు కేసీఆర్‌ పెద్ద పీట వేశారని చెప్పారు. కేసీఆర్ ప్రధానైతే దేశం రూపురేఖలు మారుతాయని అభిప్రాయపడ్డారాయన.