ఇండియన్ ఉసేన్​బోల్ట్‌ ట్రయల్స్​కి టైముందట !

ఇండియన్ ఉసేన్​బోల్ట్‌ ట్రయల్స్​కి టైముందట !


కన్నడ బోల్ట్ శ్రీనివాసగౌడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇవాళ బెంగళూరు సెంటర్‌లో ట్రయల్స్ నిర్వహించనున్నట్టు సాయ్ ట్వీట్ చేసింది. కంబళ పోటీల్లో చిరుత వేగంతో పరిగెత్తిన ఈ యువకుడిపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో,  అతడికి సాయ్‌ నుంచి పిలుపు వచ్చింది. ఉసెన్ బోల్ట్‌ను మించిన వేగంతో దున్నలతో పరుగెత్తి....దేశం దృష్టిని ఆకర్షించాడు శ్రీనివాస గౌడ. శ్రీనివాసగౌడను ఒలిపింక్‌కు పంపించాలన్న డిమాండ్లు వస్తుండడంతో అతనిలోని ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర సర్కార్ చర్యలు ప్రారంభించింది. అయితే, అతనికి వెంటనే ట్రయల్స్​ నిర్వహించడం లేదని, ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడిన తర్వాతే పరీక్ష పెడతామని సాయ్ వర్గాలు చెబుతున్నట్టు సమాచారం. ట్రయల్స్ తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే​బోల్ట్​తో తనను పోల్చడం సరికాదని శ్రీనివాస ​అంటున్నాడు. అందరూ నన్ను ఉసేన్ ​బోల్ట్​తో పోలుస్తున్నారు. కానీ అతడో ప్రపంచ చాంపియన్. నేను కేవలం బురద మళ్లలో ‌‌‌‌‌‌‌‌పరిగెత్తేవాడిని’ అని ఆయన అంటున్నారు.