జగన్ పై కావాలని దాడి చేయలేదు

జగన్ పై కావాలని దాడి చేయలేదు

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పై విడుదలయ్యాడు. ఏడు నెలల రిమాండ్‌ తర్వాత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. ప్రజా సమస్యలను కొన్నింటిని పేపర్‌పై రాసుకొని వాటిని వివరించేందుకు జగన్‌ వద్దకు వెళ్లానని శ్రీనివాస్‌ తెలిపాడు. ఆ కంగారులో జగన్‌కు కత్తి తగిలిందని చెప్పుకొచ్చాడు. నేను కావాలని దాడి చేయలేదని తెలిపాడు. అది అనుకోకుండా జరిగిందని, జగన్‌కు నేను అభిమానినని అన్నారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు ఆయనే కారణం. ప్రజలు కోరుకున్న విధంగా జగన్‌ సీఎం కావడం సంతోషంగా ఉందని శ్రీనివాస్‌ అన్నాడు.