శాయ్ ట్రైల్స్...సంచలన ప్రకటన చేసిన ఇండియన్ బోల్ట్

శాయ్ ట్రైల్స్...సంచలన ప్రకటన చేసిన ఇండియన్ బోల్ట్

శాయ్ నిర్వహించే ట్రయల్స్‌ లో పాల్గొనడం లేదని కంబాలా ఆటగాడు శ్రీనివాస గౌడ ప్రకటించి సంచలనం రేపాడు. శాయ్ ట్రాక్ ఈవెంట్‌ కోసం ట్రయల్స్‌లో పాల్గొనాలని కిరణ్ రిజిజు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన దానికి హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ విషయం మీద తనకు ఆసక్తి లేదని, కంబాలాపై దృష్టి సారిస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. కంబాలా రేసులో కాలి మడమలు కీలకం అని, కానీ ట్రాక్‌ లో పరిగెత్తాలంటే మాత్రం తన పాదాలే కీలకమని ఆయన అన్నారు. కంబాలా రేసులో జాకీలు మాత్రమే కాదు, ఎద్దుల పాత్ర కూడా ఉంటుందని ఆయన అన్నారు.