శ్రీనివాస కళ్యాణం మొదటి పాట ఇవాళే 

శ్రీనివాస కళ్యాణం మొదటి పాట ఇవాళే 

హీరో నితిన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా ఉండనుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతోంది. ఇక ఈ రోజు నుండి సినిమా ప్రమోషన్స్ లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగానే కల్యాణ వైభోగమే పాటను ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేయనున్నారు. SP బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను పాడడం విశేషం. 

ఈ చిత్రంలో నితిన్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాని పక్కా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. గతంలో ఈయన తీసిన శతమానం భవతి చిత్రం ఓవర్సీస్ ప్రేక్షకులకు, ఫ్యామిలీ సినిమాలను ఇష్టపడే వారికి బాగా నచ్చిన నేపథ్యంలో ఈ శ్రీనివాస కళ్యాణంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చగా, దిల్ రాజు నిర్మించారు. వరుస అపజయాలతో సతమతమవుతున్న నితిన్ కి ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని చిత్రబృందం గట్టి నమ్మకంతో ఉంది. ఇక పోతే ఈ చిత్రం ఆగష్టు 9న రిలీజ్ చేయనున్నారు.