విశాఖకు ఎన్ఐఏ అధికారులు

విశాఖకు  ఎన్ఐఏ అధికారులు

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఉదయం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు విశాఖపట్నం వెళుతున్నారు. ఘటనపై జరిగిన తీరుపై విశాఖ ఎయిర్ పోర్టులో క్రైమ్ సీన్ ను రీ స్ట్రక్చర్ చేయనున్నారు. నిందితుడు శ్రీనివాసరావును ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు నిన్న ఆదేశాలు ఇవ్వగా… ఇవాళ ఉదయం 10 గంటలకు ఎన్‌ఐఏ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకోనున్నారు. కాగా, శ్రీనివాసరావును వారం రోజుల పాటు ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించింది. నిందితుడికి మూడురోజులకోసారి వైద్యపరీక్షలు చేయించాలని, అతని న్యాయవాది సమక్షంలోనే విచారించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.