శ్రీరెడ్డిని అశోకుడితో పోల్చిన ఆర్జీవీ

శ్రీరెడ్డిని అశోకుడితో పోల్చిన ఆర్జీవీ
టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ నటి శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పరిశ్రమకు చెందిన కొంతమంది శ్రీరెడ్డికి అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా తమ అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. శ్రీరెడ్డికి మొదటి నుంచీ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తనదైన శైలిలో మద్దతిస్తూనే ఉన్నారు. శ్రీరెడ్డి ఝాన్సీ లక్ష్మీబాయిలా పోరాడిందంటూ రెండు రోజుల క్రితం ట్వీట్‌ చేసిన ఆర్జీవీ.. ఇప్పుడు ఆమెను అశోక చక్రవర్తితో పోల్చారు. అశోక చక్రవర్తి ఎంతో మందిని చంపాక.. వారి మృతదేహాలు చూసి కలత చెంది, ఆ తర్వాత మంచి పరిపాలన అందించాడని అన్నారు. శ్రీరెడ్డి కూడా గతంలో అభ్యంతరకర పదాలు వాడినా, ఇప్పుడు సామాజిక కార్యకర్తగా మారిపోయి, పోరాటం చేస్తుందని అన్నారు. అశోక చక్రవర్తిలాగా శ్రీరెడ్డి కూడా చాలా గొప్పదని పొగిడారు. శ్రీరెడ్డి నిజాయితీ చూసి చాలామంది మగవాళ్లు భయపడుతున్నారని అభిప్రాయపడ్డ ఆర్జీవీ.. కొంతమంది మహిళలు శ్రీరెడ్డిని చూసి ఈర్ష్యతో రగిలిపోతున్నారని అన్నారు. https://twitter.com/RGVzoomin/status/985428967061680129 https://twitter.com/RGVzoomin/status/985429874780368896 https://twitter.com/RGVzoomin/status/985431553642848256