శ్రీశైలం డ్యామ్ మూడు గేట్లు మూసివేత

శ్రీశైలం డ్యామ్ మూడు గేట్లు మూసివేత

ఎగువ ప్రాతాల నుండి వస్తున్న వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు శ్రీశైలం డ్యామ్ మూడు గేట్లను మూసివేసారు. భారీగా వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న కారణంగా శనివారం ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆదివారం వరద ప్రవాహం మరింత ఎక్కువగా ఉండటంతో మరో రెండు గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం నీటి ఉదృతి తగ్గడంతో మూడు గేట్లను మూసి ఐదు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 2,31,799 క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్ ఫ్లో 2,08,190 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయంలో 882.10 అడుగుల మేర నీటి నిల్వ ఉంది.