శ్రీశైలం డ్యామ్ అన్ని గేట్లు మూత...

శ్రీశైలం డ్యామ్ అన్ని గేట్లు మూత...

కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి వచ్చే ఇన్‌ఫ్లో తగ్గిపోయింది... దీంతో శ్రీశైలం డ్యామ్‌ అన్ని గేట్లను మూసివేశారు అధికారులు. ప్రస్తుతం శ్రీశైలానికి 46,219 క్యూసెక్కుల ఇన్ ఫ్లో  ఉండగా... ఔట్‌ ఫ్లో 1,00,081 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం  నీటిమట్టడం 883.10 అడుగులుగా ఉంది. శ్రీశైలం అన్ని గేట్లను మూసివేసినా... శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు అధికారులు.