నేడు శ్రీశైలం గేట్లు ఎత్తివేత...

నేడు శ్రీశైలం గేట్లు ఎత్తివేత...

గోదావరి నదితో పాటు కృష్ణానదిలోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది... తుంగభద్ర గేట్లు ఎత్తివేసి భారీ ఎత్తున దిగువకు నీరు విడుదల చేస్తుండడంతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది... దీంతో క్రమంగా శ్రీశైలం జలాశయానికి వచ్చిచేరి వరదనీరు పెరుగుతోంది... ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్‌కు 3.62 లక్షల క్యూసెక్కుల  నీరు వచ్చిచేరుతుండగా... ఔట్‌ప్లో 1.03 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం నీటిమట్టం 880.7 అడుగులకు చేరింది... శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు అయితే... ప్రస్తుతం 192.09 టీఎంసీలుగా ఉంది. అయితే ఈరోజు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేసి నాగార్జున సాగర్‌కు నీరు విడుదల చేయనున్నారు. కాసేపట్లో ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు... శ్రీశైలం గేట్లు ఎత్తివేయనున్నారు.